ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రోటీ కపడా రొమాన్స్'
రోటీ కపడా రొమాన్స్ సినిమా OTT లో త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వనుంది.
By Medi Samrat Published on 9 Dec 2024 6:11 PM ISTరోటీ కపడా రొమాన్స్ సినిమా OTT లో త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వనుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. యూత్ కు నచ్చే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.
ఈ చిత్రం డిసెంబర్ 12 నుండి ETV విన్ లో ప్రసారం కానుంది. ఈటీవీ విన్ కొన్ని ఆసక్తికరమైన తెలుగు చిత్రాల డిజిటల్ హక్కులను బ్యాక్ టు బ్యాక్ సొంతం చేసుకుంటూ ఉంది. కిరణ్ అబ్బవరం నటించిన 'KA' సినిమా కూడా భారీ హిట్ అయింది. 150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ రోటీ కపడా రొమాన్స్ కూడా ఇదే తరహా ఓటీటీ హిట్ ను కోరుకుంటూ ఉంది. రోటీ కపడా రొమాన్స్ ను OTT వీక్షకులు చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నూతన దర్శకుడు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన రోటీ కపడా రొమాన్స్‌లో హర్ష నర్రా, సందీప్ సరోజ్ (ఇటీవల కమిటీ కుర్రోళ్లు కనిపించారు), సుప్రజ్ రంగా, తరుణ్, సోను ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు.