నటి రోష్ని వాలియా ఓ పోడ్‌కాస్ట్‌లో కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన విజయంలో తల్లి చేసిన త్యాగం ఎంతో ఉందని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సెక్స్ గురించి మాట్లాడే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మ ఊరిని వదిలి ముంబైకి రాకపోతే నేను ఈరోజు ఇంత స్థాయికి రాలేక పోయేదాన్నని చెప్పుకొచ్చింది.
తన తల్లి చాలా మోడ్రన్‌గా ఉంటుందని, లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని పదే పదే చెబుతుందని వివరించింది. సెక్స్ చేస్తే తప్పు లేదు కానీ ప్రొటెక్షన్ తప్పనిసరిగా వాడాలని పదేపదే చెప్పేదన్నారు. ఇప్పుడు నాకు కూడా అదే చెబుతుంది అంటూ తెలిపింది. అంతే కాకుండా ఇంట్లో కూర్చోకుండా బయటకి వెళ్లి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవాలని కూడా ప్రోత్సహిస్తుందని వివరించింది రోష్ని.ఈ స్టేట్మెంట్ అందరికీ నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆమెపై, ఆమె కుటుంబ విలువలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా లైంగిక విద్య, స్వేచ్ఛకు సంబంధించి ఆమె బహిరంగ వ్యాఖ్యలను చాలా మంది విమర్శించారు.