నితిన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్ మార్చి చివరిలో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రాబిన్‌హుడ్ త్వరలోనే OTTలో విడుదల కానుంది.
రాబిన్‌హుడ్ సినిమాను నితిన్ కెరీర్‌లో రికార్డు బడ్జెట్‌తో నిర్మించారు. ఉగాది, రంజాన్ సెలవుల్లో సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులలో కనీస బజ్‌ను సృష్టించడంలో విఫలమైంది. మ్యాడ్ స్క్వేర్‌తో పోటీగా విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దారుణమైన కలెక్షన్స్ ను అందుకుంది. డిజాస్టర్‌గా ముగిసింది. రాబిన్‌హుడ్ త్వరలో OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ZEE5 వద్ద ఉన్నాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ మే 2 నుండి దీన్ని ప్రసారం చేయాలని భావిస్తోంది. అంతకు ముందే ఓటీటీలో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.