వెండితెర 'ఐరన్ మ్యాన్' కుటుంబంలో తీరని విషాదం

Robert Downey Junior father passed away. రాబర్ట్ డానీ జూనియర్ అంటే పెద్దగా మనోళ్లకు తెలియకపోవచ్చు కానీ.. 'ఐరన్ మ్యాన్' అంటే చాలు మాకు

By Medi Samrat  Published on  8 July 2021 9:42 AM GMT
వెండితెర ఐరన్ మ్యాన్ కుటుంబంలో తీరని విషాదం

రాబర్ట్ డానీ జూనియర్ అంటే పెద్దగా మనోళ్లకు తెలియకపోవచ్చు కానీ.. 'ఐరన్ మ్యాన్' అంటే చాలు మాకు బాగా తెలుసు అని చెబుతారు. అంతగా ఎవెంజర్స్ లోని క్యారెక్టర్లు మన వాళ్లకు కనెక్ట్ అయిపోయాయి. రాబర్ట్ డానీ జూనియర్ తండ్రి రాబర్ట్ డానీ సీనియర్ తుదిశ్వాస విడిచారు. హాలీవుడ్‌ నటుడు, ఫిల్మ్‌మేకర్‌ అయిన రాబర్ట్‌ డానీ సీనియర్‌ 85 ఏళ్ల వయసులో కన్ను మూశారని అధికారిక ప్రకటన వచ్చింది. ఐదేళ్లుగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ మంగళవారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నటుడిగా కెరీర్‌ ఆరంభించిన రాబర్ట్‌ డానీ సీనియర్‌ లో బడ్జెట్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన కొడుకు రాబర్ట్‌ డానీ జూనియర్‌ నటనలో వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ యాక్టర్ గా హాలీవుడ్ లో రాణిస్తూ ఉన్నాడు.

1936లో జన్మించిన డానీ సీనియర్ మూడుసార్లు వివాహం చేసుకున్నారు. న్యూయార్క్ కు చెందిన అతనితో ప్రస్తుతం మూడవ భార్య రోజ్మేరీ రోజర్స్, అతని పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్య ఎల్సీ ఆన్ డౌనీతో అతనికి ఇద్దరు పిల్లలు అల్లిసన్, రాబర్ట్ ఉన్నారు. రాబర్ట్ ప్రొడక్షన్, రచన, ఎడిటింగ్ లో కూడా దిట్ట అని నిరూపించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రనిర్మాణాల్లో ముందుండేవారు. రాబర్ట్ డానీ సీనియర్ దర్శకత్వం వహించిన చిత్రాల జాబితాలో "బూగీ నైట్స్," "మాగ్నోలియా," "టు లైవ్ అండ్ డై ఇన్ ఎల్.ఎ." ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2005 డాక్యుమెంటరీ "రిట్టెన్‌హౌస్ స్క్వేర్". ఆయన మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేశారు.


"RIP Bob D. Sr. 1936-2021…Last night, dad passed peacefully in his sleep after years of enduring the ravages of Parkinson's ..he was a true maverick filmmaker, and remained remarkably optimistic throughout..According to my stepmoms calculations, they were happily married for just over 2000 years. Rosemary Rogers-Downey, you are a saint, and our thoughts and prayers are with you." అంటూ తన తండ్రి మరణంపై రాబర్ట్ జూనియర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


Next Story