ఇక్క‌డే చదువుకున్నా, కానీ ఎప్పుడూ దర్శనానికి రాలేదు : ఆర్జీవీ

RGV Visit Durgamma Temple In Vijayawada. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా

By Medi Samrat
Published on : 13 Jun 2022 3:22 PM IST

ఇక్క‌డే చదువుకున్నా, కానీ ఎప్పుడూ దర్శనానికి రాలేదు : ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ 'విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను' అని తెలిపారు.

మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా ‌పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం' అని పేర్కొన్నారు.

శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం "కొండా" చిత్ర బృందం.. రాంగోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, నిర్మాత సుష్మిత, నటులు అదిత్ అరుణ్, ఇర్ర మోర్ ఆలయానికి వ‌చ్చిన‌ట్లు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దర్శనానంతరం వీరికి ప్రధానార్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.











Next Story