త్వరగా చనిపోవాలనుకుంటున్న వర్మ

RGV Tweet About Death. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన స్టేట్మెంట్స్ తో వార్తల్లో ఉంటుంటారు

By Medi Samrat  Published on  14 Jan 2022 10:35 AM GMT
త్వరగా చనిపోవాలనుకుంటున్న వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన స్టేట్మెంట్స్ తో వార్తల్లో ఉంటుంటారు. ఆయన మరోసారి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసి తాజాగా అందరి అటెన్షన్ ను సొంతం చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా రామ్ గోపాల్ వర్మ విషెష్ చెబుతూ.. అది కూడా తనదైన స్టైల్ లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు వర్మ.

"అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు మరియు ముకేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బుని ఇవ్వాలి. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మీకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండాలి. పురుషులందరూ ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలి. అందరు స్త్రీలు అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు వర్మ. " భర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ భార్యలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించకూడదని మరియు మీరు ఏమి చేసినా లేదా మీరు ఏమి చేయకపోయినా వారు ఓకే చేస్తారని దేవుడు మీ కోరికను ప్రసాదిస్తాడు" అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ అవ్వాలని.. నన్ను ద్వేషించే వారికోసం తాను తొందరగా చనిపోవాలని అనుకుంటున్నట్లు తన ట్వీట్ల ద్వారా తెలిపారు. ఏది ఏమైనా అందరి దృష్టిని ఆకర్షించడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని నెటిజన్లు అంటున్నారు.


Next Story
Share it