రంగంలోకి దిగిన‌ రామ్ గోపాల్ వర్మ.. సమస్య తీర్చేనా..!

RGV Meet With Minister Perni Nani. ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ నేడు

By Medi Samrat  Published on  10 Jan 2022 9:31 AM GMT
రంగంలోకి దిగిన‌ రామ్ గోపాల్ వర్మ.. సమస్య తీర్చేనా..!

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ నేడు భేటీ అయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత మరియు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో మినిస్టర్ పేర్ని నానిని కలిసేందుకు వెళ్లారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై చర్చ జరగనుంది. ఏపీలో గత కొంతకాలంగా సినిమా టికెట్ ధరలపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఏపీ ప్రభుత్వానికి, పేర్ని నానికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. వాటికి పేర్ని నాని కూడా కౌంటర్ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి ఆర్జీవీ మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ కోరారు. ఇందుకు సానుకూల స్పందన రావడంతో.. నేడు సచివాలయంలో ఇరువురు భేటీ అయ్యారు.

ఈ భేటీకి ముందు ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాలేదని.. తన అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చినట్టుగా తెలిపారు. ఇతరుల వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. తాను చెప్పదలిచినది మాత్రమే భేటీలో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చెప్తున్నదానికి మేం మాట్లాడేదానికి చిన్న చిన్న మిస్ అడర్ స్టాండింగ్స్ ఉన్నాయి.. వాటిని కూర్చుని మాట్లాకోవడానికి మాత్రమే వచ్చాను తప్పితే అంతకు మంచి ఏమీ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు నేను చెప్పిన వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా? అంటే నేనేం చెప్పలేనన్నారు. ఇండస్ట్రీ పెద్దల గురించి నేను మాట్లాడనుకోవడం లేదు.. నేను వచ్చింది ఇండస్ట్రీ తరుపున కాదని, నా తరుపున వచ్చానన్నారు. ఫిల్మ్ మేకర్‌గా మాత్రమే వచ్చానని అన్నారు వర్మ.


Next Story