'రెండూ ఒకేలా ఉన్నాయ్‌'.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్

నటుడు శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు.

By -  Medi Samrat
Published on : 27 Dec 2025 6:00 PM IST

రెండూ ఒకేలా ఉన్నాయ్‌.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్

నటుడు శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్‌ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్‌ చేసిన వ్యాఖ్యలు ' రాత్రి 9 గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. అత్యాచార కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్‌ చెప్పిన ఫుటేజ్ ఉంది. కింద నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల వీడియో ఉంది. రెండూ ఒకేలా ఉన్నాయంటూ ఆర్జీవీ తెలిపారు.

హీరోయిన్ల డ్రెస్సింగ్‌ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది. ఇంకాస్త మంచివి వేసుకోవచ్చుగా' అని అనాలనిపిస్తుంది. స్త్రీలకు స్వేచ్ఛ లేదంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది అని 'దండోరా' ఈవెంట్‌లో అన్నారు.

Next Story