మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని వస్తున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని రాబోతున్నారు.

By -  Medi Samrat
Published on : 7 Oct 2025 4:16 PM IST

మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని వస్తున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో మరో అత్యాధునిక థియేటర్‌ను తీసుకుని రాబోతున్నారు. 2018లో ఆసియన్ గ్రూప్ సహకారంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ప్రారంభమైన AMB సినిమాస్ భారీ విజయం తర్వాత, మహేష్ బాబు ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ RTC X రోడ్స్ ప్రాంతానికి AMB క్లాసిక్‌ థియేటర్ ను తీసుకువస్తున్నారు.

ఈ సరికొత్త 7-స్క్రీన్ మల్టీప్లెక్స్ ప్రొజెక్షన్, సౌండ్‌లో అధునాతన సాంకేతికత, విలాసవంతమైన సీటింగ్, షాపింగ్, డైనింగ్, గేమ్ జోన్ కోసం వాణిజ్య స్థలాలను అందిస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ థియేటర్ జనవరి 14, 2026న సంక్రాంతి సందర్భంగా తెరిచే అవకాశం ఉంది. 2018లో రజనీకాంత్ నటించిన 2.0 చిత్రంతో గచ్చిబౌలిలో AMB సినిమాస్ మొదలయ్యాయి. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే, అత్యధికంగా సందర్శించే సినిమా హాళ్లలో ఒకటిగా మారింది. ఇక AMB క్లాసిక్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story