మరోసారి గుస్సా అయిన రేణు దేశాయ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. తన కుటుంబానికి సంబంధించిన

By Medi Samrat  Published on  16 Sep 2023 11:44 AM GMT
మరోసారి గుస్సా అయిన రేణు దేశాయ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. తన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలని తెలియజేస్తూ ఉంటారు. తన కొడుకు అకిరా నందన్ గురించి కామెంట్స్ చేసిన వారికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అకీరా నందన్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఓ వైపు చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో.. ఒకరు సినిమా ఇండస్ట్రీ అంటే వారసులది మాత్రమే కాదు.. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరిది అంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైన స్పందించిన రేణు.. అంబానీ తన వారసత్వాన్ని కుమారులకు ఇస్తారు కానీ.. ఇతరుల చేతిలో పెట్టాలనుకోరు కదా.. అకీర విషయంలో కూడా అదే జరుగుతుంది.. అంటూ ఉదాహరణగా చెప్పారు.


ఈ కామెంట్‌‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. అంబానీ వ్యాపారం తన సొంతంగా పెట్టుకున్నాడు కానీ.. సినిమా ఇండస్ట్రీ ఏ కమ్మ, కాపు చౌదరిదో కాదు. మమ్మల్ని మోసం చేయాలనుకోకండి.. అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై రేణు దేశాయ్ స్పందించారు. మోసపోవడానికి నువ్వేమైనా చిన్న పిల్లాడివా? లేక ఇడియట్‌వా? అసలు నేను ఏ ఉద్దేశంతో అంబానీ ప్రస్తావన తెచ్చానో అది తెలుసుకో ముందు. నువ్వు... నీ చేతకాని తనం వల్ల నీ సమస్యలకు కూడా పక్కవాళ్ళను దూషించే రకం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తన కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై రేణు దేశాయ్ చేసినటువంటి కామెంట్ ను పట్టుకుని ఒక నెటిజన్ అలా స్పందించడంతో.. రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story