డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు హార్ట్ ఎటాక్

Remo D’souza suffers With heart attack. డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం ముంబై

By Medi Samrat  Published on  11 Dec 2020 1:08 PM GMT
డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు హార్ట్ ఎటాక్

డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం ముంబై లోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఐసీయులో ఉన్నారు. రెమో భార్య లిజెల్లె డిసౌజా మీడియాతో మాట్లాడుతూ 'అతడి హార్ట్ లో బ్లాకేజ్ ఏర్పడింది. డాక్టార్లు ఆంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఐసీయులో ఉన్నారు. దయచేసి ప్రార్థనలు చేయండి. రాబోయే 24 గంటలు చాలా ముఖ్యమైనవి' అని చెప్పుకొచ్చారు.

ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన రెమో.. దర్శకుడిగా కూడా బాలీవుడ్ కు ఎన్నో హిట్స్ అందించాడు. స్టీట్ డ్యాన్సర్ 3డీ, ఏబీసీడీ, ఏబీసీడీ2, ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. డ్యాన్స్ రియాలిటీ షోలైన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ ప్లస్, ఝలక్ దిఖలాజా వంటి వాటికి జడ్జ్ గా వ్యవహరించారు.

రెమో వయసు 46 సంవత్సరాలు. రెమో సన్నిహితులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన ఐసీయులో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సర్జరీ పూర్తీ అయిందని.. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. రెమో ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి పలువురు లిజెల్లెకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తూ ఉన్నారు.


Next Story