'నితిన్ గడ్కరీ' బయోపిక్ వచ్చేస్తోంది..!

మరో బయోపిక్ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

By Medi Samrat  Published on  7 Oct 2023 9:15 PM IST
నితిన్ గడ్కరీ బయోపిక్ వచ్చేస్తోంది..!

మరో బయోపిక్ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ ను తీసుకుని వస్తున్నారు. ఆ సినిమాకు 'గడ్కరీ' అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ పోస్టర్ లో గడ్కరీ పాత్రలో ఉన్న నటుడు వెనుక్కి చేతులు పెట్టుకున్నట్టుగా ఉంది. ఆయన ముందు రహదారులు ఉన్నాయి. గడ్కరీ క్యారెక్టర్ ను పోషిస్తున్న నటుడి గురించి కానీ, ఆయన ముఖం కానీ ఇంకా రివీల్ చేయలేదు. నితిన్ గడ్కరీ పాత్రను ఎవరు చేశారనే విషయంపై కాస్త సస్పెన్స్ నడుస్తూ ఉంది.

గడ్కరీ జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో ఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా మరాఠీ భాషలో రూపొందుతోంది. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా అనురాగ్ రాజన్ భూసారి బాధ్యతలు చేపట్టారు. అక్షయ్ దేశ్‌ముఖ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అభిజిత్ మజుందార్ సమర్పణలో ఈ చిత్రం రానుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. నితిన్ గడ్కరీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో రహదారుల రూపురేఖలే మారిపోయాయని పలువురు ప్రశంసలు గుప్పించారు. 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరు సంపాదించుకున్నారు.

Next Story