ధమాకా.. ఈ రేంజి రికార్డు వసూళ్లు ఏంటో..?

Raviteja Dhamaka Movie Collections. మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’ ఫస్ట్‌ డేనే నెగెటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది.

By Medi Samrat  Published on  2 Jan 2023 8:01 PM IST
ధమాకా.. ఈ రేంజి రికార్డు వసూళ్లు ఏంటో..?

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన 'ధమాకా' ఫస్ట్‌ డేనే నెగెటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే జనం మాత్రం సినిమాను మెచ్చారు. రవితేజ కెరీర్‌లో హైయెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా ధమాకా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.89 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి వంద కోట్లకు చేరువగా ఉంది. ఈ సినిమా పదవ రోజు రూ.4.20 కోట్ల షేర్‌ సాధించి సరికొత్త రికార్డును అందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పదవ రోజు అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నాన్‌-రాజమౌళి రికార్డు క్రియేట్‌ చేసింది. మొదటి మూడు స్థానాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి-2, బాహుబలి సినిమాలున్నాయి. సంక్రాంతి వరకు ఈ సినిమాకు పోటీగా మరో సినిమా లేకపోవడంతో భారీ లాభాలు దక్కనుంది ఈ సినిమాకు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.


Next Story