రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్

రవితేజ నటించిన మాస్ జతార సినిమా థియేటర్లలో అనుకున్న తేదీకి విడుదల కావడం డౌట్ గానే ఉంది.

By Medi Samrat
Published on : 26 Aug 2025 7:42 PM IST

రవితేజ సినిమా విడుదల వాయిదా.. ఇట్స్ అఫీషియల్

రవితేజ నటించిన మాస్ జతార సినిమా థియేటర్లలో అనుకున్న తేదీకి విడుదల కావడం డౌట్ గానే ఉంది. తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా కూడా సెప్టెంబర్ 12, 2025న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇప్పుడు మాస్ జతార సినిమా అధికారికంగా వాయిదా పడింది. ఇటీవలి ఇండస్ట్రీ సమ్మెలు, కొన్ని ఆశ్చర్యకరమైన జాప్యాలు వాయిదాకు కారణమని చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

రెండు పాటల చిత్రీకరణ, పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని సంబంధిత నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అదే రోజున బాహుబలి సినిమాను తిరిగి విడుదల చేస్తూ ఉండడంతో మాస్ జాతర సినిమా రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.

Next Story