రవితేజ 'ఖిలాడీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..

Ravi Teja's 'Khiladi' Trailer Will Be Out Tomorrow. క్రాక్ హిట్‌తో రవితేజ కెరీర్ ఊపందుకుంది. దీంతో ‘ఖిలాడీ’ సినిమాతో అభిమానులను

By Medi Samrat  Published on  6 Feb 2022 9:05 AM GMT
రవితేజ ఖిలాడీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..

క్రాక్ హిట్‌తో రవితేజ కెరీర్ ఊపందుకుంది. దీంతో 'ఖిలాడీ' సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు మాస్ మ‌హారాజ్‌. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ సినిమాను ప్రమోట్ చేయడంలో త‌ల‌ముక‌లై ఉన్నారు. ఈ నేఫ‌థ్యంలోనే పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటించి.. మాస్ మహారాజా అభిమానులందరికీ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు రమేష్ వర్మ కొత్త పోస్టర్‌ను షేర్ చేసి.. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్ర‌క‌టించారు. స్టైలిష్ పోస్టర్ షేర్ చేయ‌డంతో పాటు.. ఇదిగో మీరు ఎదురుచూస్తున్న ప్రకటన.. ఖిలాడి ట్రైలర్ విడుదల రేపు సాయంత్రం 5:04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. పోస్టర్‌లో రవితేజ లెదర్ జాకెట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.

ఖిలాడీ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. పెన్ మూవీస్, ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రిషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, భరత్ రెడ్డి, కేశవ్ తదితరులు నటిస్తున్నారు. గ్లామ్ డాల్స్ మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి ఈ చిత్రంలో కథానాయికలు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు స‌మాచారం.


Next Story
Share it