రామారావుగా రవితేజ.. డ్యూటీలో దుమ్ము దులపబోతున్నాడు

Ravi Teja New Movie Update. 'క్రాక్' తో భారీ హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. రవితేజ కెరియర్లోనే అత్యధిక

By Medi Samrat  Published on  12 July 2021 6:07 AM GMT
రామారావుగా రవితేజ.. డ్యూటీలో దుమ్ము దులపబోతున్నాడు
'క్రాక్' తో భారీ హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అది నిలిచింది. ఆ సినిమా తర్వాత 'ఖిలాడి' సినిమా పూర్తీ చేశాడు రవితేజ. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు రవి తేజ. ఆ సినిమాకు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సినిమాకు సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రవితేజ స్టైలీష్ లుక్ ఆసక్తిని పెంచేదిలా ఉంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ ఈ సినిమా ద్వారా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.


క్రాక్‌ విజయం తర్వాత విభిన్నమైన కథలను ఎంపిక చేసుకొంటూ దూసుకెళ్తున్నారు రవితేజ. తన కెరీర్‌లో 68వ చిత్రంగా రానున్న 'రామారావు ఆన్ డ్యూటీ' టైటిల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. క్రాక్ లో పోలీసాఫీసర్ గా డ్యూటీలో దుమ్ము దులిపిన రవితేజ.. ఈ సినిమాలో ఎటువంటి సందడి చేస్తాడో చూడాలి.


Next Story