లంచ్ చేస్తూ.. అలా దొరికిపోయారు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లంచ్ డేట్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

By Medi Samrat  Published on  24 Nov 2024 2:46 PM IST
లంచ్ చేస్తూ.. అలా దొరికిపోయారు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లంచ్ డేట్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కొందరు వ్యక్తులు వారి ఫోటోలను క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.

లంచ్‌లో రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ రష్మిక ఇటీవల సోలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆమె బ్లూ ట్యాంక్ టాప్ ధరించింది. ఆమెకు ఎదురుగా కూర్చున్న విజయ్ నీలిరంగు జాకెట్, బకెట్ క్యాప్‌లో కనిపించింది. శ్రీలంకలో విజయ్ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఫోటో క్లిక్ చేశారు.

రష్మిక, విజయ్ తమ సంబంధాన్ని ఎన్నడూ అంగీకరించనప్పటికీ, వారు అందుకు సంబంధించిన హింట్స్ ను మాత్రం వదులుతూనే ఉన్నారు. విజయ్ తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పాడు కానీ.. ఎవరితో ఉన్నాననే విషయాన్ని బయట పెట్టలేదు. "ప్రేమించడం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు, ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు." అంటూ విజయ్ చెప్పిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి.

Next Story