విమాన ప్రమాదం నుండి తప్పించుకున్న రష్మిక

నేషనల్ క్రష్ రష్మికకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది.

By Medi Samrat  Published on  18 Feb 2024 5:45 PM IST
విమాన ప్రమాదం నుండి తప్పించుకున్న రష్మిక

నేషనల్ క్రష్ రష్మికకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది. రష్మిక ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించింది. అయితే రష్మిక ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో రష్మిక చాలా టెన్షన్ పడింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. రష్మికతో పాటు టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్‌ కూడా

ఆ విమానంలో ఉన్నారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం ఇదే విషయాన్ని రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేసింది. 'ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’ అంటూ శ్రద్ధాకపూర్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసింది.

ముంబైలో ఉన్న రష్మిక శనివారం ఉదయం ఫ్లైట్‌లో హైదరాబాద్‌ బయలు దేరారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో తిరిగి ముంబైలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.

Next Story