తెలుగు ఇండస్ట్రీలో తనదైన డైలాగ్స్ తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రావుగోపాలరావు. విలన్, క్యారెక్టర్ పాత్రల్లో రావుగోపారావు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఆయన నట వారసుడిగా రావు రమేష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కి తగ్గ తనయుడిగా తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా శ్రీకారం సినిమాలో వీళ్లిద్దరూ రావు రమేష్, శర్వానంద్ తండ్రికొడుకులుగా నటించారు. శ్రీకారం సినిమాలో కేశవులు అనే రైతు పాత్ర పోషించాడు రావు రమేష్.
నిజజీవితంలో కూడా తను రైతు పాత్ర పోషించానని, కానీ అట్టర్ ఫెయిల్ అయ్యానని తన స్వీయానుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మద్రాసులో ఉన్నప్పుడు 1995లో వ్యవసాయంలో కొన్ని ప్రయోగాలు చేశానని.. అందులో పుట్టగొడుగుల వ్యాపారం చేశానని అన్నారు. అప్పట్లో పుట్టగొడుగుల వ్యాపారం మంచి లాభదాయకంగా ఉందని అన్నారు. న్యూస్ పేపర్లలో భారీ లాభాలు అని చదివి నేను దిగానని అన్నారు.
ఇక పుట్టగొడుగు సాగు చేయడానికి నానా కష్టాలు పడ్డానని ఒక దశలో బాబోయ్ ఈ పనిలో ఎందుకు దిగానురా అన్న బాధ కూడ కలిగిందని అన్నారు. తీరా చూస్తే ఆ వ్యాపారంలో దారుణంగా నష్టం వచ్చిందని అన్నారు. ఇండస్ట్రీకి రాకముందు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడ్డానని.. అందులో ఇలాంటి ప్రయోగాలు చేసి చాలా నష్టాలు ఎదుర్కొన్నానని రావు రమేష్ తన అనుభవాన్ని తెలిపారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ బిజీ నటుడిగా మారారు.