తన ఆరోగ్యంపై చేదు వార్త చెప్పి.. కంట‌త‌డిపెట్టిన రానా..!

Rana opens up about his health problems in Samantha's show. న‌టుడు రానా ఈ ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఈవెంట్

By Medi Samrat  Published on  23 Nov 2020 5:32 AM GMT
తన ఆరోగ్యంపై చేదు వార్త చెప్పి.. కంట‌త‌డిపెట్టిన రానా..!

న‌టుడు రానా ఈ ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఈవెంట్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ఉమెన్ మిహిక బజాజ్ ను రానా ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. రానా ఆరోగ్యంపై గ‌త కొంత‌కాలంగా రక‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌కు కిడ్నీ స‌మ‌స్య ఉంద‌ని, అందుకోసం ఆయ‌న విదేశాల్లో చిక‌త్స కూడా తీసుకుంటున్నార‌ని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌ల‌పై రానా ఏనాడు స్పందించ‌లేదు. కాగా.. తాజాగా వీటిపై రానా స్పందించాడు.

స‌మంత హోస్ట్‌గా వ్యవహరించే "సామ్‌జామ్‌" కార్యక్రమంలో పాల్గొన్న రానా ఓ చేదు వార్త చెప్పాడు. " జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న పాజ్‌ బటన్‌ వచ్చింది. పుట్టినప్పటి నుంచి బీపీ ఉంది. గుండెకు సమస్య తలెత్తుతుంది. నా కిడ్నీలు పాడవుతాయని డాక్టర్లు చెప్పారు. మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్లు అన్నారు" అని రానా చెబుతూ.. కన్నీరు పెట్టుకున్నాడు.

హోస్ట్‌‌ సమంత కూడా కంటతడి పెట్టుకుంది. అనంత‌రం స‌మంత మాట్లాడుతూ.. మీ చుట్టూ ఉన్న వాళ్లు ఎన్ని ర‌కాలుగా మాట్లాడినా.. కూడా మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఆ స‌మ‌యంలో నేను మిమ్మ‌ల్ని స్వ‌యంగా చూశాను. మీరు నిజంగా ఓ సూప‌ర్ హీరో అని సమంత చెప్పింది. కాగా.. ప్రస్తుతం రానా నటిస్తోన్న "విరాట పర్వం" సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే.. అరణ్య మూవీ విడుదలకు సిద్ధం అయింది. 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు.Next Story
Share it