సుకుమార్ శిష్యుడికి అవకాశం ఇచ్చిన రానా..

Rana Acts In Naa Istam Movie Director. యంగ్‌ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో అరణ్య

By Medi Samrat  Published on  7 March 2021 1:41 PM GMT
Rana Acts In Naa Istam Movie Director

యంగ్‌ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో హిరన్య కశ్యప సినిమాను కూడా తెరకెక్కించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలు కాకుండా త్వరలో దగ్గుబాటి రాణా మరో సినిమా చేయబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు సుకుమార్‌ శిష్యుల్లో ఒకరు అని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ శిష్యులు టాలీవుడ్ లో విజయాలను అందుకుంటున్నారు. నాగచైతన్య- రాజ్ తరుణ్ – వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలకు సూపర్ హిట్లు అందించింది సుకుమార్ శిష్యులే.

ఇప్పడు సుకుమార్‌ శిష్యుల్లో ఒకడైన వెంకీ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా రాబోతుందని సమాచారం. గతంలో సుకుమార్ శిష్యుల్లో ఒకడైన ప్రకాష్ దర్శకత్వంలో నా ఇష్టం అనే సినిమా చేసాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తాపడింది. తాజాగా మరోసారి సుకుమార్‌ శిష్యుడితో రానా సినిమా చేయబోతున్నాడు. నా ఇష్టం లాంటి సినిమా తర్వాత చాలా ఇప్పుడు తిరిగి సుకుమార్ శిష్యుడికి రానా అవకాశం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

అందమైన ప్రేమ కథగా...

అంతే కాదు ఈ సినిమా కూడా అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటోందని చెబుతున్నారు. ఇటీవల సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మెగా హీరో వైష్ణవ తేజ్ కు సంచలన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సుకుమార్ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అలానే రానా సినిమాకు కూడా సుకుమార్ తనవంతు సహాయ సహకారాలు అందించనున్నారని అంటున్నారు.


Next Story