రామారావు ఆన్ డ్యూటీ మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే..!

Ramarao On Duty First Day Collections. మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ.

By Medi Samrat  Published on  30 July 2022 2:00 PM IST
రామారావు ఆన్ డ్యూటీ మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే..!

మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ. రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ లు సినిమాలో నటించారు. రవితేజ లాంటి స్టార్ సినిమా మీద సినీ ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను రామారావు అందుకోలేదనే ప్రచారం సాగుతోంది. జూలై 29న విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.82 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ వసూళ్లు మొదటిరోజు వస్తాయని అనుకున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ను చూస్తే.. నైజాం: 85 లక్షలు, సీడెడ్: 52లక్షలు, ఉత్తరాంధ్ర: 45 లక్షలు, ఈస్ట్: 31 లక్షలు, వెస్ట్: 16 లక్షలు, గుంటూరు: 24లక్షలు, కృష్ణ: 17 లక్షలు, నెల్లూరు: 12 లక్షలు వచ్చాయి. ఇక ఏపీ-తెలంగాణలో 2.82 కోట్ల షేర్ (4.75 కోట్ల గ్రాస్)‌ను వసూలు చేసింది. కర్నాకటతో పాటూ రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.25 కోట్లు, ఓవర్సీస్ : 35 లక్షలు. వరల్డ్ వైడ్ మొత్తంగా 3.42 కోట్లు (5.9 కోట్లు~ గ్రాస్). ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 17.20 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.











Next Story