రామ్ పెళ్లి గోల.. ఛాన్స్ లేదట

Ram Pothineni debunks wedding rumours. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.

By Medi Samrat  Published on  29 Jun 2022 11:38 AM GMT
రామ్ పెళ్లి గోల.. ఛాన్స్ లేదట

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. తన స్కూల్ మేట్ నే రామ్ ప్రేమించి పెళ్లాడబోతున్నట్టు ప్రముఖ మీడియా సంస్థలు వార్తలను వండి వార్చాయి. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలిపాయని.. ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ పెళ్లి జరగవచ్చని.. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు కథనాలను ప్రచారం చేశారు. ఇక రామ్ తాజా చిత్రం 'వారియర్' జులై 14న విడుదల కాబోతోంది. సినిమా విడుదలైన తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందని చెప్పుకొచ్చారు.

తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను హీరో రామ్ ఖండించాడు. ' ఓరి దేవుడా.. ఆపండి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.. నేను నా స్కూల్ ఫ్రెండ్‌ని, సీక్రెట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటున్నాను అనే రూమర్లు ఇంటి వరకు చేరాయి.. వారికి కూడా అవన్నీ రూమర్లేనని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు.. నిజం చెప్పాలంటే.. నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్‌కి కూడా వెళ్లేవాడిని కాదు' అంటూ రామ్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు రామ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

రామ్ 'ది వారియర్' అనే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. లింగుసామీ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. హీరోయిన్ గా కృతి శెట్టి చేసింది.





Next Story