ఒకేసారి మూడు పాత్రలతో ప్రయోగం చెయ్యబోతున్న రామ్..!

Ram is going to experiment with three characters at once.రెడ్ సినిమాలో మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్ ఇప్పుడు ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలతో అలరిస్తాడాని టాక్ వస్తోంది.

By Medi Samrat
Published on : 8 Feb 2021 1:28 PM

Ram is going to experiment with three characters at once

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు రామ్ పోతినేని. ఇటీవల రెడ్ సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. పెట్టిన పెట్టుబడికి 5కోట్లకు పైగా లాభాలను అందించింది. పోటీగా క్రాక్ మాస్టర్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ రామ్ మంచి గట్టి పోటీని ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.రెడ్ సినిమా కంటే ముందు వరకు కూడా లాక్ డౌన్ లో చాలా కథలను విన్న రామ్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మారుతితో అలాగే సురేందర్ రెడ్డి కమర్షియల్ దర్శకులతో చర్చలు జరిగినట్లు టాక్ వచ్చింది గాని వర్కౌట్ కాలేదు.

ఇక ఫైనల్ గా ఒక కొత్త దర్శకుడికే రామ్ ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది. లాక్ డౌన్ నుంచి ఆ కొత్త దర్శకుడు రామ్ తో పర్సనల్ గా ట్రావెల్ అవుతూ వస్తున్నాడట. ఇక అందులో రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని టాక్ వస్తోంది.

రెడ్ సినిమాలో మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్ ఇప్పుడు ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలతో అలరిస్తాడాని టాక్ వస్తోంది. యాక్షన్ లవ్ మాస్ లుక్స్ లలో ఆడియెన్స్ కు సరికొత్త కిక్కివ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం శివ మాలలో ఉన్న రామ్ దీక్ష అనంతరం సినిమా కి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వనున్నాడు.




Next Story