ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశాక ఆ పాత్ర గురించి మాట్లాడిన ఆర్జీవీ

విజయవాడలో ప్రేక్షకులతో కలిసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ వ్యూహం సినిమా చూశారు.

By Medi Samrat  Published on  3 March 2024 4:54 PM IST
ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశాక ఆ పాత్ర గురించి మాట్లాడిన ఆర్జీవీ

విజయవాడలో ప్రేక్షకులతో కలిసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ వ్యూహం సినిమా చూశారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించానన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పటి నుండి జగన్ సీఎం అయ్యేవరకూ ఫస్ట్ పార్ట్ లో ఉందన్నారు. శపథం సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందని తెలిపారు.

సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శపథం మూవీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసిందని తెలిపారు. మార్చి 9న చిత్రం రిలీజ్ కానుందని వెల్ల‌డించారు. హీరో అజ్మల్ అమీర్, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సినిమాకు చాలా మంచి స్పందన వస్తోందన్నారు. వర్మ సినిమాను బాగా తెరకెక్కించారని కొనియాడారు.

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశార‌ని కితాబిచ్చారు. వర్మ గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారన్నారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోందన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story