గ్రీన్ ఇండియన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

Ram Gopal Varma takes up Green India Challenge. ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం శ్రీనగర్ కాలనీలో రాజ్యసభ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్

By Medi Samrat  Published on  20 March 2022 12:25 PM GMT
గ్రీన్ ఇండియన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం శ్రీనగర్ కాలనీలో రాజ్యసభ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. జర్నలిస్ట్ స్వప్న నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడానికి నామినేషన్‌ను అంగీకరించిన రామ్ గోపాల్ వర్మ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ స్వప్నతో కలిసి శ్రీనగర్ కాలనీలోని పబ్లిక్ పార్కును సందర్శించిన వర్మ ఈరోజు ఉదయం మొక్కను నాటారు. అనంత‌రం జర్నలిస్ట్ స్వప్న ట్విటర్‌లో వర్మకు కృతజ్ఞతలు తెలిపింది. ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు సహకరించిన రామ్‌గోపాల్‌ వర్మకు ధన్యవాదాలు ట్వీట్ చేసింది.

Next Story
Share it