సొంత డబ్బులతో ఓ టాప్ హీరో తన సినిమాను ఆడించాడు: ఆర్జీవీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో సహజీవనం చేస్తూ ఉంటారు. ఆయన తన X/Twitter ఖాతాలో అనేక సమస్యలపై ట్వీట్లు చేశారు.

By Medi Samrat  Published on  6 Aug 2024 8:15 PM IST
సొంత డబ్బులతో ఓ టాప్ హీరో తన సినిమాను ఆడించాడు: ఆర్జీవీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో సహజీవనం చేస్తూ ఉంటారు. ఆయన తన X/Twitter ఖాతాలో అనేక సమస్యలపై ట్వీట్లు చేశారు. తాజాగా ఆయన ఓ సంఘటనను బయటపెట్టి అందరినీ షాక్ కు గురి చేశారు. ఓ టాప్ హీరో తన సొంత డబ్బుతో థియేటర్లో తన సినిమాను నడిపించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ జర్నలిస్ట్ భరద్వాజ్ రంగన్‌తో చాలా విషయాల గురించి మాట్లాడారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన సినిమాని థియేటర్‌లో నడపాలని ఓ అగ్ర తెలుగు హీరో పట్టుబట్టిన సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన కార్పొరేట్ కంపెనీ దానిని థియేటర్ల నుండి తీసేయాలని కోరుకుందని.. అయితే నటుడు తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి తన స్వంత డబ్బుతో దీన్ని నడుపుతానని వారికి హామీ ఇచ్చారని ఆర్జీవీ చెప్పారు. ఈ విషయం డిస్ట్రిబ్యూటర్‌కు కూడా తెలియదన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం రామ్ గోపాల్ వర్మ వెల్లడించలేదు. అది ఎవరన్నదానిపై చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చించుకుంటున్నారు. హీరో ఎవరనేది బయటపెట్టాలని పలువురు రామ్ గోపాల్ వర్మను డిమాండ్ చేస్తున్నారు.

Next Story