రేవంత్‌ను 'రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌'గా అభివ‌ర్ణించిన ఆర్జీవీ

Ram Gopal Varma Praises Revanth Reddy. సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో అసలు ఊహించలేము..!

By Medi Samrat  Published on  27 April 2022 7:27 PM IST
రేవంత్‌ను రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా అభివ‌ర్ణించిన ఆర్జీవీ

సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో అసలు ఊహించలేము..! అది సినిమా వాళ్ల విషయంలో అయినా.. రాజకీయాల పరంగా అయినా..! ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాను చూసిన వాళ్లకు అలాంటి అనుభూతే ఎదురైంది. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాంగోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డితో క‌లిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన రాంగోపాల్ వ‌ర్మ.. రేవంత్ రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా అభివ‌ర్ణిస్తూ పొగిడారు. రేవంత్ రెడ్డి, వ‌ర్మ క‌లిసి దిగిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. తెలంగాణ ప్లీనరీ జరిగిన రోజే వర్మ ఈ కామెంట్ పెట్టడానికి కారణం ఏమిటో..?

టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ''చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి. అమర వీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది'' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story