మంచోడే.. ఓ గుడ్ న్యూస్ చెప్పిన ఆర్జీవీ

Ram Gopal Varma opens RGV den discover future filmmakers. రామ్ గోపాల్ వర్మ.. అనవసరమైన వివాదాల కారణంగా ఆయన్ను తప్పుబట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు

By Medi Samrat  Published on  31 July 2023 2:00 PM GMT
మంచోడే.. ఓ గుడ్ న్యూస్ చెప్పిన ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ.. అనవసరమైన వివాదాల కారణంగా ఆయన్ను తప్పుబట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ..! డైరెక్షన్ లో ఆయన సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఎంతో మంది టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన శిష్యులు ఎంతో మంది టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంకొంత మందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. హైదరాబాద్ లో RGV డెన్ ను ఇటీవల ఏర్పాటు చేయగా.. ఆర్జీవీ డెన్ కు ఇంట్రెస్టేడ్ డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ ట్వీట్ చేశారు. ఒక స్పెషల్ నోట్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి బయటకు వచ్చిన చాలా మంది యాక్టర్స్ , డైరెక్టర్స్ కొత్తవారిని కలుస్తూనే ఉంటాను.. వారి ట్రైనింగ్ మొత్తం ప్రస్తుత సినీ పరిశ్రమ ఎలా పని చేస్తుందనే విషయంలో వారు చాలా తప్పుగా ఉన్నారనే విషయం అర్ధం అయిందని అన్నారు. ఒక ఫిలిం మేకర్.. మంచి కాన్సెప్ట్ రాసుకుని.. తన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ తో కూడా వండర్ క్రియేట్ చేయవచ్చు.. దానికి అనవసరమైన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళ్లి.. మీ డబ్బులు వృధా చేసుకోవొద్దని సూచించారు.

కొంతమంది ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తో నా ఇంటరాక్షన్ టైంలో.. వారు పూర్తిగా డిస్టర్బ్ గా ఉండటం నేను చాలాసార్లు చూశాను. వారిలో ఎక్కువ మంది.. కొన్ని దూర ప్రపంచాలలో నివసిస్తున్నట్లు.. వారు తీయాలనుకుంటున్న మూవీస్ గురించి కొన్ని మీనింగ్ లెస్ థాట్స్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ముఖ్యంగా డైరెక్టర్‌గా మారడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా వర్క్ చేయడం అనేది ఒక జోక్. ఉదాహరణకు డైరెక్టర్ శేఖర్ కపూర్, మణిరత్నం, నేను ఎప్పుడూ అసిస్టెంట్‌లుగా వర్క్ చేయలేదని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓన్ టాలెంట్, క్రియేటివిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని తెలియజేశారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా కంటే గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేస్తామనీ నమ్మకం వుంటేనే RGV డెన్ కు రండి. అనవసరంగా మా టైంని వృధా చేయకండి.. అంటూ RGV అన్నారు. అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో ఆర్జీవీ వెబ్ సైట్ డీటైల్స్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ డీటేల్స్ కోసం https://rgvden.com/ సైట్ ని చూడండి.


Next Story