ఏడేళ్ల నాటి కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. 7 సంవత్సరాల నాటి చెక్ బౌన్స్ కేసును విచారించిన ముంబై కోర్టు.. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు హాజరుకాలేదని.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. రామ్ గోపాల్ వర్మ 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3 లక్షల 72 వేల 219 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని.. కుదరకపోతే మూడు నెలల పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్రనిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకోబడిందని కోర్టు పేర్కొంది. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే 2022లో ఒకసారి బెయిల్ పొందారు.
ఇదిలాఉంటే.. రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన రాబోయే చిత్రం గురించి తన అధికారిక X ఖాతాలో ఒక ప్రకటన చేశారు. చిత్రం పేరు సిండికేట్.