ఆచార్య సెట్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Visit Acharya Movie Set. టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య.

By Medi Samrat  Published on  27 Dec 2020 9:17 AM GMT
ఆచార్య సెట్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య. మెగాస్టార్ కెరీర్‌లో 152 వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. లాక్‌డౌన్ అనంత‌రం ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ సురేశ్ సెల్వ‌రాజ‌న్ వేసిన సెట్‌లో ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్‌లో రామ్‌చ‌ర‌ణ్ అడుగుపెట్టాడు. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ సురేశ్ తో క‌లిసి టీ తాగుతూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను ఆర్ట్ డైరెక్ట‌ర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.
Next Story
Share it