అప్పుడు చిరంజీవితో కాదని.. ఇప్పుడు చరణ్‌తో సినిమా చేస్తున్న శంకర్
Ram Charan Shankar Movie. అప్పుడు చిరంజీవితో కాదని.. ఇప్పుడు చరణ్‌తో సినిమా చేస్తున్న శంకర్.
By Medi Samrat Published on 17 Feb 2021 11:19 AM ISTమొత్తానికి రామ్ చరణ్ తన 15 వ సినిమాని శంకర్ తో ప్రకటించడం జరిగింది. దిల్ రాజు బ్యానర్ లో ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడే శంకర్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. గతంలో భారతీయుడు 2 సినిమా చేయడానికి శంకర్ తో కమిట్ అయ్యాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. కానీ, కొన్ని కారణాలవల్ల అది చేతులు మారిపోయింది. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో శంకర్ సినిమా చేయాల్సి వచ్చింది. దీనికోసం రామ్ చరణ్ డేట్స్ ని ఎడ్జెస్ట్ చేస్కుని మరీ ఇప్పుడు సినిమాని ప్రకటించారు.
RC15 కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఓ న్యూస్ బయటకి వచ్చింది.నిజానికి గతంలో చూసుకున్నట్లయితే రోబో ఆడియో లాంఛ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ తో సినిమా చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పాడు. కానీ, అప్పుడు శంకర్ చిరంజీవి సినిమా గురించి ఏం స్పందించలేదు.ఆ విషయం లైట్ తీసుకోని శంకర్ మర్చిపోయాడు. ఆ తర్వాత మెగాస్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, మళ్లీ తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ తో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు.
సైరాతో పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించాడు.అలాంటిది అప్పుడు చిరంజీవి కి నో చెప్పి, ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాకి సై అన్నాడు డైరెక్టర్ శంకర్.ఇక ఆకస్మాత్తుగా ఎందుకిలా జరిగిందా అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి వీరిద్దరి సినిమా ఏ జోనర్లో ఉండబోతోందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగానే ఇది ఉంటుందని , శంకర్ స్టైల్లో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తండ్రికి నో చెప్పి కొడుకుతో సినిమా చేస్తున్నాడు.