రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న బుచ్చిబాబు

Ram Charan locks his next with Buchi Babu Sana. మైత్రీ మూవీస్‌లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ భారీ విజయం సాధించింది.

By Medi Samrat  Published on  28 Nov 2022 7:00 PM IST
రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న బుచ్చిబాబు

మైత్రీ మూవీస్‌లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన' భారీ విజయం సాధించింది. 2021లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా విజయం తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్‌‌తో సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీశ్‌తో కలిసి మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించబోతున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది.

తన శిష్యుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా సినిమా వస్తోందని స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు. కొన్నిసార్లు తిరుగుబాటు అనేది అవసరంగా మారుతుంది అంటూ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story