2025 సంక్రాంతికి విడుదలవ్వనున్న భారీ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ 250 అడుగుల కటౌట్ పెట్టనున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
డిసెంబర్ 29వ తేదీన విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు చరణ్ అతి పెద్ద కటౌట్‌ను ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 250 అడుగులతో భారతీయుల అతిపెద్ద కటౌట్ అవుతుంది. భారతదేశంలో అతిపెద్ద కటౌట్ పరిమాణం 230 అడుగులు కాగా ఆ రికార్డును ఈ ఈవెంట్ తో కొల్లగొట్టనున్నారు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ డిసెంబర్ 27న హైదరాబాద్ యూసఫ్ గూడ మైదానంలో విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతారనే ప్రచారం సాగింది. దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. గేమ్ ఛేంజర్ మరో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 04న రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అంటున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.