మాస్ గ్లింప్స్ నాకు తెగ నచ్చేసింది: రామ్ చరణ్
Ram Charan comments about Powerstar’s new film glimpse. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు.
By Medi Samrat
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. పదకొండేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నారు. పవన్ సరసన యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రంలో పవన్ పవర్ పుల్ పోలీసాఫీర్ పాత్రలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 11 ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల పవన్ కళ్యాణ్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను గుర్తు చేశారని అభిమానులు చెప్పుకొచ్చారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనిపై స్పందించారు. ఈ మాస్ గ్లింప్స్ నాకు తెగ నచ్చేసిందని.. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూసేందుకు ఇక ఆగలేనని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
“పవన్ కళ్యాణ్ గారి ఈ మాస్ గ్లింప్స్ నాకు బాగా నచ్చింది. ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను. టీమ్ మొత్తానికి గుడ్ లక్” అంటూ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను మెగా అభిమానులు తెగ రీట్వీట్ చేస్తున్నారు. ఈ టీజర్ లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌తో కనిపించి మెప్పించారు. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ ఎస్‌ఐగా పవన్ కనిపించబోతున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. గ్లింప్స్ చివరలో ‘ఈసారి పెర్ఫామెన్స్ బద్ధలవుతుంది..సాలే’ అని పవన్ చెప్పడం హైలైట్ గా మారింది.