రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎవరిని చేసుకోబోతోందంటే.?

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులందరితో నటించింది. టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

By Medi Samrat  Published on  3 Feb 2024 4:37 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎవరిని చేసుకోబోతోందంటే.?

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులందరితో నటించింది. టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే మన్మధుడు-2 తర్వాత ఆమె కెరీర్ తెలుగులో ఆశించిన రేంజిలో సాగలేదు. దాంతోపాటూ ఆమె పలు హిందీ సినిమాలకు కమిట్ అయింది. ఇక అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నాని తో రకుల్ డేటింగ్ లో ఉంది. ఇక ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రకుల్-జాకీల గ్రాండ్ వెడ్డింగ్ గోవాలో ఫిబ్రవరి 21, 2024న జరగనుంది. ఫిబ్రవరి 19 నుండి రెండు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లు ఉన్నాయి. ఈ శుభకార్యానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించారు.

Next Story