రాయలసీమ ఓబులమ్మగా రచ్చ రచ్చ చేయనున్న రకుల్..!
Rakul Preet Singh as Rayalaseema village belle Obulamma. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కెరీర్
By Medi Samrat Published on 19 Dec 2020 2:49 PM IST
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి అమ్మడు గ్లామర్ పాత్రలే పోషిస్తోంది. అయితే.. తొలి సారి డీ గ్లామర్ పాత్ర చేయనుంది రకుల్. రాయలసీమ ఓబులమ్మగా కనిపించనుంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో రకుల్ ఈ పాత్రను చేయనుంది. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వైష్ణమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ కీలక పాత్ర చేయనుంది. ఈ సినిమా కథ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారి నవల 'కొండపొలం' ఆధారంగా చేసుకొని చేయనున్నారు.
ఈ నవల కథ ఎక్కువగా నల్లమల్లా అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. వారు తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. వారు ఏవిధంగా నివసించేవారు అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ సినిమాతో రకుల్ అభిమానులను తన లుక్స్‌తేనే కాకుండా రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆశ్చపరుస్తుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. సినిమాకు కూడా కొండపొలం పేరునే నిశ్చయించేందుకు చిత్ర బృందం ఆలోచిస్తోంది.
ఇదిలా ఉంటే.. తన పాత్ర గురించి రకుల్ మాట్లాడింది. ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రను పోషించాను. డీ గ్లామర్ పాత్ర.. పైగా, రాయలసీమ యాసలో మాట్లాడుతుంటాను. ఇది నాకు కలకాలం గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి అవుతుంది. ఎప్పుడూ గ్లామర్ తో కూడిన పాత్రలే చేస్తుంటే మన మీద ఓ ముద్రపడిపోతుంది. ఈ అమ్మాయి గ్లామర్ పాత్రలు మినహా మరేమీ చేయలేదేమోనని దర్శక నిర్మాతలు అనుకుంటారు. అందుకే, అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది రకుల్.