ర‌జ‌నీకాంత్ సినిమాకు ఈ రేంజ్ క‌లెక్ష‌న్‌లా..?

లాల్ సలామ్ సినిమా తెలుగు వెర్షన్ డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు కనీస ఓపెనింగ్‌స్ నోచుకోలేకపోయింది ఈ సినిమా.

By Medi Samrat  Published on  10 Feb 2024 1:58 PM IST
ర‌జ‌నీకాంత్ సినిమాకు ఈ రేంజ్ క‌లెక్ష‌న్‌లా..?

లాల్ సలామ్ సినిమా తెలుగు వెర్షన్ డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు కనీస ఓపెనింగ్‌స్ నోచుకోలేకపోయింది ఈ సినిమా. రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి ఓపెనింగ్ నంబర్లు చాలా తక్కువ. అతను మెయిన్ లీడ్ కాకపోయినా.. కీలక పాత్ర పోషించాడు. సినిమా అంతటా ఆ పాత్ర కనిపించింది. ఇది రజనీకాంత్ సినిమా కాదని ఏ మాత్రం అనిపించలేదు. రజనీకాంత్ మంచి ఎక్స్‌టెన్డెడ్ రోల్ చేసినా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసినా టీమ్ తెలుగు మార్కెట్‌పై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. తెలుగులో కనీసం పాటలు విడుదల చేయలేదు. తెలుగు ట్రైలర్ కేవలం ఒక రోజు ముందు విడుదలైంది. లాల్ సలామ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా పేలవమైన ఓపెనింగ్స్ తో సినిమా విడుదలైంది. చాలా థియేటర్లు తొలిరోజే సినిమాను ఎత్తివేసి.. వేరే సినిమాలు వేసుకోవాలని ఫిక్స్ అవుతున్నాయి. లాల్ సలామ్ తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ డే షేర్ 20 లక్షల లోపే ఉందంటే.. అది ఎంత దారుణంగా తెరకెక్కిందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రిప్పింగ్ గా సినిమాను తెరకెక్కించడంలో దర్శకురాలు ఫెయిల్ అయ్యారు. తమిళ వెర్షన్ పర్వాలేదనే నంబర్స్.. డీసెంట్ రిపోర్ట్స్ తో థియేటర్లలో నెగ్గుకు వస్తూ ఉంది. తమిళంలో లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి. బడ్జెట్, రజనీకాంత్ స్టార్ డమ్ ను పరిశీలిస్తే, తమిళ మార్కెట్ ఓపెనింగ్స్ కూడా సంతృప్తికరంగా లేవు. సినిమాను ప్రమోట్ చేయకుండా థియటర్లలోకి వదిలేశారు.

Next Story