రజనీకాంత్ 'లాల్ సలామ్'.. ఫస్ట్ డే.. ఫస్ట్ షోలు క్యాన్సిల్..!

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా నేడు విడుదల అయింది.

By Medi Samrat  Published on  9 Feb 2024 5:03 PM IST
రజనీకాంత్ లాల్ సలామ్.. ఫస్ట్ డే.. ఫస్ట్ షోలు క్యాన్సిల్..!

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా నేడు విడుదల అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది. మొయిదీన్ భాయ్ గా రజనీ మాస్ ఎంట్రీపై అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత స్పందన రావడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రేక్షకులు లేక మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మ్యాట్నీ నుండి కలెక్షన్స్ కాస్త పుంజుకున్నాయి.

రజనీకాంత్ నటించిన జైలర్ రూ. 47 కోట్లకు పైగా షేర్ రాబట్టి తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో డబ్బింగ్ సినిమాగా నిలిచింది. అయితే లాల్ సలామ్ సినిమా విషయంలో రజనీకాంత్ తెలుగు అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా ట్రైలర్ లో మనో కాకుండా సాయి కుమార్ వాయిస్ రజనీకాంత్ కు ఉండడం కూడా విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో రజనీకి డబ్బింగ్ చెప్పిన వారిలో సాయి కుమార్ కూడా ఉన్నారు.. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మనో బాగా సెట్ అయ్యారు. అందుకే ట్రైలర్ కూడా తెలుగులో పెద్ద హిట్ అవ్వలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలైన వివిధ సెంటర్లలో తక్కువ హాజరు కారణంగా లాల్ సలామ్ మొదటి రోజు మార్నింగ్ షోలు రద్దు చేశారు.

Next Story