47 ఏళ్ల తర్వాత క‌లిసి న‌టిస్తున్నారు.. ‘ఎవరు హీరో?’ అని అడుగున్నారు..!

తమిళ సినిమా దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రానికి సంబంధించిన అద్భుతమైన ప్రోమోను మేక‌ర్స్ శ‌నివారం విడుదల చేశారు.

By -  Medi Samrat
Published on : 21 Feb 2026 2:42 PM IST

47 ఏళ్ల తర్వాత క‌లిసి న‌టిస్తున్నారు.. ‘ఎవరు హీరో?’ అని అడుగున్నారు..!

తమిళ సినిమా దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రానికి సంబంధించిన అద్భుతమైన ప్రోమోను మేక‌ర్స్ శ‌నివారం విడుదల చేశారు. ఇది అభిమానులు, సినీ ప్రియులను అల‌రిస్తుంది. తాత్కాలికంగా #KHXRK అని పిలవబడుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక చిత్రంలో కనిపించనున్నారు.

KHxRK గ్లింప్స్ లో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేశారు. ఇద్దరిలో ముందుగా ఎవరి రూమ్ కి వెళ్లాలని నెల్సన్ కన్ఫ్యూజ్ అవ్వడం.. అనిరుధ్ ఏ రాగం కంపోజ్ చేయాలనేది టు ఫింగర్ టెక్నీక్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం వంటివి ఫన్నీగా అనిపిస్తున్నాయి. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్ట్, చేతి వాచీ, కళ్లద్దాలు.. ఇలా ప్రతీ దాంట్లో రజనీ - కమల్ ఎవరికి వారు తమ డామినేషన్ చూపించేలా ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ వీడియో రూపొందించారు. ఇద్దరూ స్టైల్ గా నడుచుకుంటూ వచ్చే సీన్, ఒకరికొకరు ఎదురుగా నిలబడే షాట్ హైలైట్ గా నిలిచాయి. రజనీ తనదైన శైలిలో కారు కీ ఇవ్వడం, దాన్ని అందుకొని కమల్ స్టైల్ గా డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడం.. ఇవన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ‘ఎవరు హీరో?’ అని ఇద్దరూ అడగడం అలరిస్తుంది. ఓవరాల్ గా KHxRK రీయూనియన్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేశారు. ఇక సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Next Story