దసరాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న

Rajamouli Appreciates Dasara Team. 'దసరా' సినిమాకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి.

By Medi Samrat
Published on : 3 April 2023 8:32 PM IST

దసరాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న

Rajamouli Appreciates Dasara Team


'దసరా' సినిమాకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు. "నాని - కీర్తి సురేశ్ గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించాడు. పెద్ద హిట్ అందుకున్న టీమ్ కి అభినందనలు" అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఇక కలెక్షన్స్ లో దసరా సినిమా దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.87 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘దసరా’.. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో రూ.100 కోట్లు రాబట్టనుంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని రూ.38 కోట్ల గ్రాస్‌ను ‘దసరా’ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో తెలుగు వెర్షన్ తొలి వారం దుమ్ములేపింది. ‘దసరా’ ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.53 కోట్లు, మూడు రోజుల్లో రూ.71 కోట్లు, నాలుగు రోజుల్లో రూ.87 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ గ్రాస్ రూ.10 కోట్ల మేర ఉంది.


Next Story