అక్కడ దసరా సినిమా రేట్లు భారీగా తగ్గించేశారు

Makers of Dasara reduce ticket price to Rs 112 for the Hindi version. నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన

By M.S.R  Published on  3 April 2023 3:05 PM IST
అక్కడ దసరా సినిమా రేట్లు భారీగా తగ్గించేశారు

Hero Nani


నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా సినిమా టికెట్ రేట్లను చిత్ర యూనిట్‌ త‌గ్గించింది. అయితే తెలుగులో కాదు.. హిందీలో..! మ‌ల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధ‌ర‌ను రూ.112 రూపాయ‌లుగా చేశారు. తెలుగులో భారీగా సినిమా దూసుకుపోతోంది.. కానీ ఇతర భాషల్లో సినిమా కలెక్షన్స్ ఏమంత గొప్పగా లేవు. హిందీ వెర్షన్‌లో తొలిరోజు రూ.40 ల‌క్షల వ‌సూళ్లు మాత్రమే రాబట్టింది. టికెట్ రేట్లు తగ్గిస్తే హిందీ వెర్షన్ ను జనాలు చూస్తారని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘దసరా’ సినిమా బాగా ఆడుతుందని భావించారు. అయితే మూవీ మేకర్స్ అనుకున్నంత రెస్పాన్స్ అయితే దక్కడం లేదు. ఎక్కువగా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో సినిమాకు అక్కడ మంచి కలెక్షన్స్ రావట్లేదు. తెలుగులో మాత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.


Next Story