చ‌లికి వ‌ణుకుతూనే షూటింగ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం

Rajamouli and team shiver in cold while shooting for RRR. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న

By Medi Samrat  Published on  17 Nov 2020 5:46 PM IST
చ‌లికి వ‌ణుకుతూనే షూటింగ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తారక్, చరణ్ ఇంట్రో వీడియోలు సినిమాపై అంచనాల‌ను అమాంతం పెంచేశాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే తిరిగి ప్రారంభ‌మైంది. కొవిడ్-19 నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ అర్థరాత్రి షూటింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వెల్లడిస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. 'సెట్ హీటర్స్ లేకుండా ఎవరూ ఈ చల్లని గాలుల నుంచి తప్పించుకోలేరు' అని పేర్కొంది. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది.



రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఇలా అందరూ సెట్ లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటున్నారు. చలి కాలం.. అందులోనూ నైట్ టైమ్ షూట్స్ అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా షూటింగ్ కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో టీమ్ పని చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.


Next Story