ఆమె ఆరోపణల్లో నిజం లేదు: రాజ్ తరుణ్

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  5 July 2024 6:39 PM IST
ఆమె ఆరోపణల్లో నిజం లేదు: రాజ్ తరుణ్

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. 11 ఏళ్లుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని, శారీరకంగానూ ఒక్కటయ్యామని, ఒకే ఇంట్లో ఉండేవాళ్లమని తెలిపారు. రాజ్‌ తరుణ్‌ తన కొత్త సినిమాలో హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించారు. అతడిని ప్రశ్నించినందుకు తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చాడు. లావణ్య చెబుతున్నట్లుగా ఎలాంటి సంబంధం లేదన్నాడు రాజ్ తరుణ్. లావణ్యను మోసం చేయ‌లేదని.. తనే నన్ను మోసం చేసిందని అన్నాడు. అందువ‌ల‌నే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దని అనుకుంటున్నా అంటూ రాజ్ త‌రుణ్ చెప్పాడు. ఈ విషయంలో తనకు సపోర్ట్ చేయాలని మీడియాను కోరాడు రాజ్ తరుణ్.

Next Story