Video : ఒకే కారులో సమంత, రాజ్‌.. ఆ కోపానికి కార‌ణ‌మేంటి.?

మాజీ భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కొన్ని సినిమాల్లో క‌నిపించారు.

By Medi Samrat
Published on : 31 July 2025 10:16 AM IST

Video : ఒకే కారులో సమంత, రాజ్‌.. ఆ కోపానికి కార‌ణ‌మేంటి.?

మాజీ భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కొన్ని సినిమాల్లో క‌నిపించారు. నాగ చైతన్య మరో నటి శోభితా ధూళిపాళను రెండవ వివాహం చేసుకోగా.. సమంత మాత్రం ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేష‌న్‌లో ఉంద‌ని ఊహాగానాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రాజ్, సమంతల వ్యవహారంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గ‌తంలో ఇద్దరూ కలిసి స్పోర్ట్స్ ఈవెంట్‌కు.. గుడికి వెళ్లడంతో ఈ చ‌ర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి కనిపించారు. కానీ ఈసారి రాజ్ కొంచెం కోపంగా కనిపించాడు.

గత రాత్రి అంటే జూలై 30న సమంతా, రాజ్ నిడిమోరు కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపించారు. దీని కారణంగా వారు డిన్నర్ డేట్‌ను ఆస్వాదించడానికి కలిసి వచ్చినట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ నుంచి వెళ్లడమే కాదు.. ఒకే కారులో ఎక్కారు. ముందుగా సమంత బయటకు వచ్చి కారులో కూర్చుంది.. తర్వాత రాజ్ వచ్చాడు.

రాజ్ నిడిమోరు కారులో కూర్చునే స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్లు అతనిని చుట్టుముట్టారు. దీంతో ఆత‌డు కారు డోర్ మూసేసేటప్పుడు కోపంగా చూస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

సమంత, రాజ్ నిడిమోరు సిటాడెల్ హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఈ వెబ్ సిరీస్‌కు రాజ్, డికె దర్శకత్వం వహించగా.. వరుణ్ ధావన్‌తో క‌లిసి సమంత ప్రధాన పాత్రలో నటించింది. కొంతకాలం క్రితం సమంతా కొన్ని ఫోటోలను షేర్ చేయ‌గా.. అందులో రాజ్ తన ప‌క్క‌న నించొని పోజులిచ్చాడు. అయితే రిలేష‌న్ విష‌యంలో మాత్రం ఇరువురి నుంచి ఎటువంటి స్ప‌ష్ట‌త రాలేదు.

Next Story