రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరు

Raj Kundra granted bail in pornography case on Rs 50000 surety. అశ్లీల చిత్రాల‌ కేసులో అరెస్టైన‌ బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబయి

By Medi Samrat  Published on  20 Sept 2021 6:56 PM IST
రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరు

అశ్లీల చిత్రాల‌ కేసులో అరెస్టైన‌ బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ ముంబైలోని మెట్రోపాలిట‌న్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ తోర్పేకు కూడా బెయిల్ మంజూరైంది. అశ్లీల చిత్రాల కేసులో జులై 19 నుంచి రాజ్‌కుంద్రా కస్టడీలో ఉన్నారు.

సినిమా అవ‌కాశం కోసం ముంబైకి వ‌చ్చిన ప‌లువురు యువ‌తుల‌ను మోస‌గించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసులో విచార‌ణ ముగిసిన నేప‌థ్యంలో త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని రాజ్‌కుంద్రా శ‌నివారం ముంబై మెట్రోపాలిట‌న్ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో త‌న‌ను త‌ప్పుగా ఇరికించార‌ని, ఎఫ్ఐఆర్‌లో పేరు లేక‌పోయినా పోలీసులే త‌న‌ను కేసులోకి లాగార‌ని ఆరోపించారు. ఆయ‌న పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన ముంబై న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది.


Next Story