మోస్ట్ వాంటెడ్ బ్యూటీకి.. వరుస ఫ్లాప్ లు..!
Raining Flops For Most Wanted Beauty. ఉప్పెన సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది కృతి శెట్టి. యంగ్ హీరోలతో
By Medi Samrat Published on 13 Aug 2022 8:30 PM ISTఉప్పెన సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది కృతి శెట్టి. యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది ఈ భామ. అయితే అమ్మడికి వరుసగా ఫ్లాప్ లు ఎదురవుతూ ఉండడంతో కెరీర్ టెన్షన్ లో పడింది. హీరోయిన్లు స్వింగ్ లో ఉండాలంటే కొత్త ప్రాజెక్ట్‌లను చేయడమే కాకుండా హిట్స్ కూడా వస్తూ ఉండాలి. లేదంటే ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోవడం ఖాయం. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొంటూ ఉంది. కృతి కొత్త చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం రెండూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులు గా నిలిచాయి.
ఉప్పెనతో తన కెరీర్‌లో మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు వంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. కానీ రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలవలేదు. ఇక మాచర్ల, వారియర్ సినిమాలు రెండూ వరుసగా ఫ్లాప్ ను అందుకోవడం కృతి కెరీర్‌ను దెబ్బతీశాయి. ఉప్పెన బ్యూటీకి ఇప్పుడు ఫ్లాపుల వర్షం కురుస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఈ యంగ్ బ్యూటీ తదుపరి సినిమా సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే చిత్రంలో కనిపించనుంది. ఇలా ప్రతి ఒక్క టాప్ హీరోయిన్ కెరీర్ లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు కృతి కూడా ఆ స్టేజ్ నుండి బయటకు వచ్చి హిట్స్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఇక ఈ భామ డ్యాన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నా.. మంచి పాత్రలు కూడా చేయాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.