షాకిచ్చిన రాహుల్.. బిగ్‌బాస్ బ్యూటీ అషుతో రిలేషన్ షిప్..!
Rahul Sipligunj opens up about his relationship with Ashu Reddy. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా సింగర్ రాహుల్
By Medi Samrat Published on 18 Nov 2020 1:12 PM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా సింగర్ రాహుల్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే పునర్నవి పేరు గుర్తుకు వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 సమయంలో వారిద్దరిపై వచ్చిన పుకార్లు.. వారిద్దరి మద్య నడిచిన వ్యవహారం అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ అనంతరం కూడా రాహుల్.. పునర్నవి రిలేషన్ లో ఉన్నారని చాలా పుకార్లు వచ్చాయి. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు కలిసి కనబడటం. రాహుల్ పాటలు పాడటం పునర్నవి మురిసిపోవడం చేసేది . ఇవన్నీ చూసి ఈ ఇద్దరిమధ్య ఎదో ఉంది . త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని పునర్నవి ఇప్పటికే చెప్పగా తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పెద్ద షాకే ఇచ్చాడు.
మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. బ్యాక్ టు అవర్ రియల్ రిలేషన్ షిప్ అంటూ ఓ ఫొటోను షేర్ చేసిన రాహుల్ అందరిని ఆశ్చర్యపరిచాడు.అషు రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమెను జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. ఇక పవన్ కళ్యాణ్ పేరును తన శరీరంలోని సీక్రెట్ పార్ట్ లో టాటూ వేయించుకోవడంతో ఈమెకు మరింత పాపులారిటీ దక్కింది. రాహుల్ సిప్లిగంజ్ మరియు అషులు ఒక వీడియో ఆల్బంలో నటించారు. అందులో ముద్దు సీన్ కూడా చేయడం జరిగింది.
అయితే పునర్నవి ఇటీవల ఎంగేజ్మెంట్ అంటూ ఓ ఫోటో పెట్టి ఆ తర్వాత తూచ్ ఇదిఅంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమే అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాహుల్ రియల్ రిలేషన్ అంటూ పోస్ట్ పెట్టిన ఇదికూడా ఏదైనా పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి అసలు సంగతి ఏంటో అషు చెబితేనే తెలుస్తాది.