రాధే శ్యామ్ టీజర్ కు లీకుల దెబ్బ

Radhe Shyam Teaser leaked pics. రాధే శ్యామ్ సినిమా టీజర్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 23వ తేదీన విడుదల కాబోతోంది.

By M.S.R  Published on  22 Oct 2021 10:04 AM GMT
రాధే శ్యామ్ టీజర్ కు లీకుల దెబ్బ

రాధే శ్యామ్ సినిమా టీజర్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 23వ తేదీన విడుదల కాబోతోంది. అయితే టీజర్ విడుదలకు ముందే టీజర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరో కొందరు లీక్ చేసి.. వైరల్ చేశారు. అయితే అవి నిజమేనా కాదా అనే క్లారిటీ టీజర్ రిలీజ్ అయితే కానీ చెప్పలేము. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు సంబంధించిన టీజర్లు లీక్ అవ్వడం తెలిసిందే..! రాధేశ్యామ్ విషయంలో ప్రస్తుతానికి మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి.

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనుంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్‌ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ని మూవీ యూనిట్‌ వెల్లడించింది. "రాధేశ్యామ్" సినిమా నుండి విడుదలైన ఒక పిక్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో "విక్రమాదిత్యగా" కనిపించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ భారీగా ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశం కోసం ఏకంగా రూ. 50 కోట్లు కేటాయించారని అంటున్నారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే ఈ సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Next Story
Share it