హాట్‌ టాపిక్‌గా.. విడాకులపై పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌..!

Putting a sensational post on the topic of divorce .. Poonam Kaur. సినిమాల్లో అవకాశాలు రాకపోయిన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది పూనమ్‌ కౌర్‌. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

By అంజి  Published on  9 Nov 2021 5:46 AM GMT
హాట్‌ టాపిక్‌గా.. విడాకులపై పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌..!

సినిమాల్లో అవకాశాలు రాకపోయిన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది పూనమ్‌ కౌర్‌. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం ట్వీట్‌ చేసిందంటే.. భార్య భర్తలు తీసుకునే విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు తీసుకున్న త‌ర్వాత పురుషులు ఏ మాత్రం బాధ‌ప‌డ‌రా, స్త్రీలే ఇబ్బందులు ప‌డాలా? అంటూ పూనమ్‌ కౌర్‌ ప్రశ్నించింది. స్త్రీలే వారిని మాటలతో బాధిస్తారు అని.. వారి వల్లే పురుషులకు కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

విడాకుల అంశాన్ని మ‌నం పూర్తి స్థాయిలో అర్ధం చేసుకున్నామా.? విడాకులపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా? అంటూ పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత కాసేపటికే ట్వీట్‌ను డిలీట్‌ చేసింది. ట్వీట్‌ డిలీట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భామ ఎవరిని ఉద్దేశించి ట్వీట్‌ చేసి డిలీట్‌ చేసిందని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. తన పర్సనల్‌ లైఫ్‌ విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటూ పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఇన్‌డైరెక్టగా ఎవర్ని ఉద్దేశించి ట్వీట్‌ చేసిందో తెలియాల్సి ఉంది. 2006లో మాయాజాలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పూనమ్‌ కౌర్‌ పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఏది కూడా సరైన గుర్తింపు తీసుకురాలేదు.


Next Story
Share it